Pawan Kalyan visited VIMS hospital and I.T. Center area on June 29th

విమ్స్, ఐటి పార్కును పరిశీలించిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లాలో పోరాట యాత్రలో భాగంగా విమ్స్ ఆసుపత్రికి విచ్చేశారు. ఆయన హాస్పిటల్లో ఉన్నబాధితులకు ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారో విమ్స్ డైరెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన రోగులను కలిసి పరామర్శించారు. అనంతరం పవన్ కళ్యాణ్ రిషికొండ లో ఉన్న ఐటీ సెంటర్ ను పర్యవేక్షిస్తారు.

విమ్స్ హాస్పిటల్ ను విచ్చేసిన పవన్ కళ్యాణ్ తర్వాత రిషికొండ లో ఉన్న ఐటీ సెంటర్ ను విచ్చేశారు. అక్కడ పార్క్ లోని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు. సరదాగా ఆయన కాసేపు బైక్ లో తిరిగారు. అక్కడ ఉన్న అందాలను పవన్ కళ్యాణ్ తన ఫోన్ తో ఫోటోలు తీసుకున్నారు.

Pawan Kalyan visited VIMS hospital and I.T. Center area on June 29th

Pawan Kalyan visited VIMS hospital and I.T. Center area

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విశాఖ నగరం రుషికొండ ప్రాంతం నుండి చూస్తే సౌత్ అఫ్రికా కేప్ టౌన్‌ను తలపిస్తోందన్నారు. ప్రభుత్వం ఎటువంటి విజన్ లేకుండా ఏక పక్షంగా వ్యవహరించటంతో 50 ఏళ్ల తర్వాత ఇటువంటి సుందర ప్రదేశం కాలుష్య కోరల్లో చిక్కుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్కడ ఉన్న స్థానికులంతా ఉద్యోగ అవకాశాలు లేవని జనసేనాని తో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వము ఇంతకుముందు లక్ష ఉద్యోగాలు ఉన్నాయంటూ చెప్పిందని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కనీసం రెండు, మూడు వేల ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పారు. ప్రభుత్వం కనీసం విశాఖ పోర్టు ట్రస్ట్ నుండి విడుదలయ్యే కాలుష్యం అన్న అరికట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.