Pawan Kalyan Visited Pollution Affected Areas Around Visakhapatnam Port.

పోర్ట్ ట్రస్ట్ నిర్లక్ష్యం పై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్రలో భాగంగా జూన్ 28వ తేదీన విశాఖ వన్ టౌన్ లో పర్యటించారు. అక్కడ పోర్ట్ ట్రస్ట్ నిర్లక్ష్యం మూలంగా కాలుష్యంతో నల్లగా మారిన పరిస్థితులను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టు కాలుష్యం తో వేలాది మంది దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారని తెలుసుకున్న ఆయన పాత పట్నం లోని కోట వీధిలో కాలినడకన పర్యటించారు. ప్రజలంతా తమ కష్టాలను తెలుసుకోవడానికి జనసేన అధినేత వచ్చారని తెలుసుకుని వారి కష్టాలను వాపోయారు.

పోర్టు పరిధిలో బొగ్గుపొడి, యూరియా, ఇనుపఖనిజం లాంటివి సముద్రం మీదుగా వచ్చే గాలులతో బొగ్గు నిల్వలు నుంచి దుమ్ము రేగి నగరం వైపు వస్తుందని తెలిపారు. సుమారు 14 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలు కాలుష్యం బారిన పడుతున్నాయి స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Pawan Kalyan in Vishakapatnum Port

Pawan Kalyan in Vishakapatnam Port

పోర్టు కాలుష్యం వల్ల తినే తిండి, తాగేనీరు, కట్టుకుని దుస్తులు నల్లగా మారిపోతున్నాయని చెప్పారు. ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు ఊపిరితిత్తుల వ్యాధికి గురవుతున్నారని, వృద్ధులు కీళ్ల నొప్పులతో, క్యాన్సర్ వ్యాధుల బారిన పడుతున్నారని వెల్లడించారు.

వీటిని పరిశీలించిన పవన్ కళ్యాణ్ జబ్బులు తమకు ఇచ్చి.. డబ్బులు మాత్రం పోర్ట్ ట్రస్ట్ పొందుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నో సార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోవడం లేదని స్థానిక నాయకులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని జనసేనాని ముందు వాపోయారు.

కాలుష్య బాధితుల కష్టాలు విన్న పవన్ కళ్యాన్ పోర్ట్ నిర్లక్ష్యం మూలంగా చోటుచేసుకుంటున్న కాలుష్యంపై చేపట్టే పోరాటంలో బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు అనంతరం  ముడసర్లోవ చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ ముడసర్లోవ రిజర్వాయర్ ను పరిశీలించారు. రిజర్వాయర్ భూములు కబ్జాకు గురయ్యాయని తెలుసుకున్న ఆయన ప్రకృతి వనరులను చేస్తే బ్రతకడం ఎలా అని ప్రశ్నించారు.