జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర మేధావులతో జిల్లా సమస్యలు మరియు పార్టీ నిర్మాణంపై చర్చ

ఉత్తరాంధ్ర మేధావులతో పవన్ కళ్యాణ్ చర్చ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభం చేయబోతున్న పోరాట యాత్రలో భాగంగా ఆయన మంగళవారం సాయంత్రం విశాఖపట్నంకు చేరుకున్నారు. అక్కడ ఆయన పార్టీ శ్రేణులతో జిల్లా సమస్యలు మరియు పార్టీ నిర్మాణంపై చర్చలు జరిపారు. 27 వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మేధావులతో జిల్లా వెనుకబాటుతనం పై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కుప్పం యూనివర్సిటీ మాజీ వైస్చాన్స్లర్  కె. ఎస్. చలం సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.

జులై 8వ తేదీన….

జులై ఎనిమిదో తేదీ విశాఖ జిల్లాలో పర్యటన పూర్తవుతుంది. అదేరోజు పదివేల మంది జనసైనికులతో భారీ ప్రదర్శనను జనసేన పార్టీ ఏర్పాటు చేయనున్నారు. జనసైనికులు విశాఖ నగరంలో నిరసన కవాతు చేస్తారు. ఈ నిరసన ను పవన్ కళ్యాణ్ ముందుండి నడిపిస్తారు.

  • ఎరుపు దుస్తులు ధరించిన ఆజాద్ యువజన విభాగం,
  • ఆరెంజ్ దుస్తులతో భగత్సింగ్ విద్యార్థి విభాగం,
  • తెల్లటి దుస్తులతో సేవాదళ్  విభాగం,
  • ఆలివ్ గ్రీన్ దుస్తులు ధరించిన జనసేన రక్షకదళ్ విభాగం

పవన్ కళ్యాణ్ ను అనుసరిస్తారు. దీనితో పాటు జిల్లాలో అనకాపల్లి, చోడవరం, గాజువాక, పెందుర్తి, భీమిలి తో పాటు విజయనగరం జిల్లాలోని ఎస్.కోట నియోజకవర్గాలలో జరగనున్న బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు.

విశాఖ నగరంలో కాలుష్యం, భూ ఆక్రమణలు, పౌర సదుపాయాలను స్వయంగా పరిశీలిస్తారు. విశాఖ నగరం ఉత్తర వివిధ వర్గాల వారు, వ్యాపార, వాణిజ్య ప్రేమికులు, రాజకీయ నేతలు స్వచ్ఛంద సేవకులు తదితరులను పవన్ కళ్యాణ్ కలుస్తారు.

విశాఖ పర్యటన అనంతరం రెండురోజుల చొప్పున విజయవాడ,  హైదరాబాద్ లలో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వెళతారు. అనంతరం జూలై 14వ తేదీ లేదా ఆ తరువాత జనసేన పోరాట యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభమవుతుంది.