Janasena Party Chief Pawan Kalyan Porata Yatra in Bhimavaram

భీమవరం కు చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్:

ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కు చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ బీసీ సంఘం నాయకులను, బ్రాహ్మణ సంఘాల వాళ్ళను మరియు ఇతర సంఘాల నేతలతో భేటీ అయ్యారు.

బీసీ సంఘాలతో జనసేనాని భేటీ…

పోరాట యాత్రలో భాగంగా భీమవరంలో బీసీ కమ్యూనిటీ నాయకులతో సమావేశమయిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…

  • ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలని తెలిపారు.
  • 2009 లో వెనుకబడిన కులాల కోసం ఒక గొప్ప ప్రయత్నం  చేశాము కానీ ఈ రాజకీయ విధానంలో అది విజయం సాధించలేదు అంటూ వాపోయారు.
  • గ్రామాల్లో కులాల కన్నా ఆత్మ సంబంధం ముఖ్యమైనది, బంధాలు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. మనిషికి మనిషికి ఉన్న బంధాలకు కులాల వల్ల వ్యత్యాసం రాకూడదని తెలిపారు.
  • సమాజాన్ని అన్ని రకాలుగా విభజించి పాలిస్తున్నారని విమర్శించారు. కులాల ఐక్యత అనేది తన ఆశయమని స్పష్టం చేశారు.

Pawan Kalyan Porata Yatra in Bhimavaram

బ్రాహ్మణ  సంఘాల వారితో జనసేనాని భేటీ…

పోరాట యాత్రలో భాగంగా భీమవరం కు చేరుకున్న జనసేన అధినేత బీసీ సంఘాల వారితో సమావేశం అనంతరం  బ్రాహ్మణ సంఘాల వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

  • భారతదేశం అనేక కులాల సమూహం. మన సంస్కృతిని చాలా బలంగా కాపాడుతుంది బ్రాహ్మణ సమాజం అని తెలిపారు.
  • జ్ఞానానికి తగ్గ పారితోషికం ఉండాలి కాబట్టి మీరు చెప్పిన ఇన్సూరెన్స్ ల వంటి వాటిని నేను కచ్చితంగా ముందుకు తీసుకెళ్తారని భరోసా ఇచ్చారు.
  • నేను ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదు. నాకు అధికారం అనేది అంతిమ లక్ష్యం కాదు అని తెలిపారు.
  • ఎన్నో చర్చిలు, దేవాలయాలు ఉన్న ప్రాంతం భీమవరం. ఎందరో మహానుభావులు పుట్టిన ప్రాంతం. భీమవరం నేలలో చాలా శక్తి ఉందని తెలిపారు.

Pawan Kalyan Porata Yatra in Bhimavaram

చివరగా నేను బలమైన పోరాటం చేయగలను. అధికారం అనేది దానికంతట అదే రావాలి తప్ప, నేను దాని కోసం పాకులాడను అంటూ ప్రసంగం ముగించారు.