Pawan Kalyan Met Quarry Blast Victims In Kurnool District on Monday

హత్తిబెళగల్ గ్రామాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్

కర్నూలు జిల్లాలో ఆలూరు మండలం హత్తిబెళగల్ వద్ద శుక్రవారం క్వారీలో ఘోర ప్రమాదం జరిగి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన పేలుడు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు మరియు ఈ సంఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి కర్నూలు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్లని ఆ బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.

Pawan Kalyan Met Quarry Blast Victims

Pawan Kalyan Met Quarry Blast Victims

ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వంటి ప్రాంతాల నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్లు మరణించడం చాలా బాధాకరమైన సంఘటన అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట వేసినప్పుడే హత్తిబెళగల్ క్వారి పేలుడు లాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని అన్నారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ ను ప్రభుత్వం తక్షణం నిలిపివేయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోని పక్షంలో జన సైనికులే వాటిని మూయిస్తారని హెచ్చరించారు.

ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అక్రమ మైనింగ్ జరుగుతుంటే మైనింగ్ శాఖ మంత్రి, అధికారులు ఏం చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 1300 క్వారీలకు అనుమతులు ఇచ్చారని మరో 600 వరకు అక్రమ క్వారీలు నడుస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రజలు ఎంతో తీవ్రంగా నష్టపోతున్నారని తెలియజేశారు.

హతిబెళగల్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం మానేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. చివరగా బాధితులందరికీ జనసేన అండగా ఉంటుందని ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు..