Pawan Kalyan Met Handloom Workers On National Handloom Day

చేనేత కళాకారులతో పవన్ కళ్యాణ్…

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం నుండి చేనేతకు సంబంధించిన వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నేడు ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత కళాకారులను కలిశారు. అక్కడ కళాకారులను కలిసి వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అలాంటి దుస్తులను తయారు చేసే చేనేత కళాకారులను ప్రభుత్వం, అధికారులు చిన్నచూపు చూస్తున్నాయి అంటూ వాపోయారు. ఎంతో కష్టంతో కూడిన ఈ పని చేసే చేనేత కళాకారులకు ఎటువంటి సహకారం అందించడం లేదంటూ తెలియజేశారు.

పవన్ కళ్యాణ్ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ తమకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది అని తెలిపారు. చివరగా నేనెప్పుడూ చేనేత కార్మికులు అంటే ఒప్పుకోను చేనేత కళాకారుడు అంటే ఒప్పుకుంటాను అని తెలిపారు.