Janasena Chief Pawan Kalyan inaugurating JSP IT Centre, Raidurgam, Hyderabad

జనసేన ఐటీ సెంటర్ ప్రారంభోత్సవం…

ఇంతవరకు ఎటువంటి రాజకీయాల్లో లేని విధంగా కొత్తగా జనసేన పార్టీ ఐటి ఉద్యోగులకు ప్రాముఖ్యతను కల్పించడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో రాయదుర్గం నందు పవన్ కళ్యాణ్ సంప్రదాయంగా పూజలు నిర్వహించి జనసేన ఐటీ సెంటర్‌ ను ప్రారంభించారు.

Pawan Kalyan inaugurating JSP IT Centre

Pawan Kalyan inaugurating JSP IT Centre

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…

  • జనసేన పార్టీలో రెండు కోట్ల మందిని భాగస్వాములను చేయడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నడుస్తోంది అని తెలిపారు.
  • సామాజిక, రాజకీయ బాధ్యతతో కూడిన వ్యవస్థను జనసేన తెలుగు రాష్ట్రాల్లో తీసుకు వస్తుందని స్పష్టం చేశారు.
  • దేశం కోసం పాతికేళ్లు ఈ రాజకీయాల్లో ఉండేందుకు నేను వచ్చాను అని తెలిపారు.
  • సమాజంలో అండదండలు కరువైన వారికి జనసేన అండగా ఉంటుందని చెప్పారు.

ప్రారంభోత్సవం అనంతరం పవన్ కళ్యాణ్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం, రవి ప్రసాద్, పార్థసారథి, తదితరులు పాల్గొన్నారు.

Pawan Kalyan inaugurating JSP IT Centre

Pawan Kalyan inaugurating JSP IT Centre

ఈ కేంద్రంలో పనిచేయుటకు 800 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా ఆనందకరంగా ఉందంటూ పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, లోటుపాట్లను ఎప్పటికప్పుడు జనసేన నేతలకు, జనసైనికులకు అందించడమే ఐటీ సెంటర్ నాలెడ్జ్ హబ్ ల ముఖ్య ఉద్దేశ్యమని పవన్ కళ్యాణ్ అన్నారు.

Pawan Kalyan inaugurating JSP IT Centre

Pawan Kalyan inaugurating JSP IT Centre

ఇంతవరకు మిస్డ్ కాల్ ద్వారా పార్టీ సభ్యులుగా 10 లక్షలమంది ఒక సీజన్లో చేరారు అని తెలిపారు. క్షేత్రస్థాయిలో సభ్యత నమోదు కోసం పుస్తకాలు  పంపించామన్నారు. పార్టీ నిర్మాణం ఎంతో సహనంతో చేయాల్సిన ప్రక్రియ అని తెలిపారు.

(Video Source: Janasena Party Youtube Channel)