Mega Fans Joined in to Janasena Party in Anantapur District on July 11th, 2018

అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ లోకి మెగా అభిమానులు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జులై 9 వ తేదీన మెగా అభిమానుల ఆత్మీయ సదస్సు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో జనసేన పార్టీ లోకి అఖిల భారత చిరంజీవి యువత చేరడం జరిగింది. ఇందులో భాగంగానే జూలై 11వ తేదీన అనంతపురం జిల్లాకు చెందిన మెగా అభిమానులు జిల్లా నాయకుల సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన కార్యకర్తలకు, మెగా అభిమానులకు ధన్యవాదములు తెలియజేసారు.

అఖిల భారత చిరంజీవి యువత ఇచ్చిన పిలుపుతో  మెగా అభిమానులు జనసేన పార్టీ లోకి చేరడం చాలా ఆనందకరంగా ఉందని మరియు వీరి రాకతో పార్టీ కు సంబంధించిన సేవా కార్యక్రమాలు చేయడంలో జనసేన పార్టీ మరింత బలపడుతుందని జిల్లా నాయకుడు తెలిపారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ప్రతి జనసేన కార్యకర్త కృషి చేయాలని కోరారు.