JSP Training Program Will Starts From Uttarandhra Revealed by Pawan Kalyan

జెఎస్పి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉత్తరాంధ్ర నుండి ప్రారంభం కానుంది

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జెఎస్పి ట్రైనింగ్ ప్రోగ్రాం వివరాలు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం జూన్ నెల చివర నుంచి ఉత్తరాంధ్ర నుండి ప్రారంభం కానుందని తెలిపారు.

జన సైనికులకు పవన్ కళ్యాణ్ ఈ విధంగా తెలుపుతూ…

  • పోరాటం చేసే వారికి తెగువతో పాటు సమర్థత మరియు విషయ పరిజ్ఞానం తెలిసి ఉండాలి అని తెలిపారు.
  • సరికొత్త రాజకీయ చైతన్యం లక్ష్యంగా కృషి చేస్తున్న జనసేన పార్టీ అన్ని నియోజకవర్గాలలో బూత్ స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించనుంది అని అన్నారు.
  • ప్రజలలో ఏళ్లతరబడి కొనసాగుతున్న బేధాభిప్రాయాలు, వైషమ్యాలు సమూలంగా తొలగించడానికి ఈ ప్రయత్నమని చెప్పారు.

ట్రైనింగ్ ప్రోగ్రాం రెండో భాగం వివరాలు:

  • ఈ శిక్షణా కార్యక్రమాలు జనసేన పార్టీ పొలిటికల్ అనలిస్ట్ దేవ్ మరియు వారి టీం నిర్వహిస్తారు.
  • జనసేన పార్టీ తరపున బొమ్మదేవర శ్రీధర్ గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు.
  • ఆరు గంటల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమానికి అందరూ హాజరై క్రమశిక్షణతో వారి శిక్షణలో పరిపూర్ణులు అవ్వాలని ఆశించారు.

భావితరాలకు నిజాయితీతో కూడిన రాజకీయ వ్యవస్థ అందించాలనే మన సంకల్పానికి ఇది తొలి అడుగు అని మన ఆలోచనలు ఆశయాలు ఈ వేదిక ద్వారా మరింత బలపడతాయని విశ్వసిస్తున్నాను అంటూ తెలిపారు.